టాలీవుడ్ యంగ్ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరైన నటుడు శర్వానంద్ తాజాగా ఎట్టకేలకు వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యారు. ఈ ఏడాది జనవరి 26న ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సడన్గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.. మాజీ మంత్రి అయిన టిడిపి నేత స్వర్గీయ gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షిత రెడ్డి శర్వానంద్ వివాహం చేసుకున్నారు. ఇక ఈయన తండ్రి కూడా హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ రక్షిత రెడ్డి వివాహం చాలా ఘనంగా జరిగింది.
ఇక ఈ వేడుకల కు ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు రాజకీయ నాయకులూ కూడా రావడం జరిగిందట. జూన్ 2 ఉదయం పల్ది ఫంక్షన్ జరగదు అదే రోజు రాత్రి సంగీతి వేడుకలు జరగగా శర్వానంద్ పెళ్లి వేడుకలు జూన్ మూడవ తేదీ రాత్రి 11 గంటలకు వివాహమైనది మొత్తానికి ఇన్నాళ్లకు శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ని వీడి ఒక ఇంటివాడయ్యాడు.. శర్వానంద్ వివాహానికి రామ్ చరణ్, సిద్ధార్థ్, నిర్మాత వంశీ తదితర సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖుల సైతం వెళ్లడం జరిగింది.


ఇక కొంతమంది బంధువులు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. కేవలం కొన్ని ఫోటోలు మాత్రమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శర్వానంద్ సినిమాలు విషయానికి వస్తే చివరిగా ఒకే ఒక జీవితం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే శర్వానంద్ వివాహం చేసుకోవడంతో కాస్త సినిమాలు ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా శర్వానంద్ వివాహంతో అభిమానులు కాస్త సంబరపడిపోతున్నారు. మరి మిగిలిన టాలీవుడ్ హీరోలు ఇంకెప్పుడు వివాహం చేసుకుంటారో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: