తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో సిద్ధార్థ్ ఒకరు. ఈయన శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తమిళ్ తో పోలిస్తే తెలుగు లో అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు కూడా సిద్ధార్థ్ కు దక్కాయి.

అందులో భాగంగా ఈ నటుడు నటించిన తెలుగు సినిమాలలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో ఈ నటుడు కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజ్ విపరీతంగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ఈ నటుడు తెలుగు లో ఆఖరుగా మహా సముద్రం సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ "ఓయ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని సాధించకపోయినప్పటికీ విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది.

అలాగే ఆ సమయంలో థియేటర్ లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమాను ఆ తర్వాత బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులు మంచి విజయాన్ని చేశారు. తాజాగా సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... ఓయ్ లాంటి మూవీ ని మళ్లీ తీయాలి అని అంటున్నారు. మొదటి సారి తీసినప్పుడే వైజాగ్ లో తప్ప ఎక్కడ ఆ సినిమా సరిగా ఆడలేదు. అలాంటి సినిమా మళ్లీ ఎందుకు తీయాలి అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: