నందమూరి బాలకృష్ణ చివరిగా వీర సింహారెడ్డి సినిమాతో మంచి ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఈసారి కచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరొకవైపు ఈనెల 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య బర్త్డే సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగ వంశీ ట్విట్టర్లో జూన్ 10 తేదీన అంటు సింహం ఇమేజిని షేర్ చేయడం జరిగింది. ఈ కాంబోలో సెట్ అయ్యి కొన్ని నెలలు అవుతోంది ..కానీ కొన్ని కారణాలవల్ల అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆ మధ్య అన్ స్టాపబుల్ షోలో కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా ప్రకటన రాబోతోంది.అయితే డైరెక్టర్ ఎవరనే విషయంపై ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. కచ్చితంగా ఈ సినిమా అందరిలోనూ ఆసక్తి రేపే విధంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ బాబి తో ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా పూర్తి అయిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ సితార ఎంటర్టైన్మెంట్లు బాలయ్య సినిమా ఉంటుంది అంటూ ఇప్పుడు నాగ వంశీ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏడాదిలో బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా ప్రారంభమైతే కచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతికి మరొకసారి బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుందట. ఒకవైపు బాలయ్య కోసం బోయపాటి కూడా సినిమా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: