మోడలింగ్ పై ఉన్న ఆసక్తితో ఢిల్లీ నుంచి ముంబయి చేరుకున్న కృతి.. అవకాశాలు వేటలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ఒకసారి ర్యాంప్‌షో చేస్తున్న సమయంలో ఒక కొరియోగ్రాఫర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అందరి ముందు అవమానించాడట. ఆ అవమానాన్ని తట్టుకోలేక కృతి.. తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తాను అంటూ ఏడ్చేసిందట. అయితే ఆ సమయంలో వాళ్ళ అమ్మగారు చెప్పిన ధైర్యం ఇప్పుడు తనని ఈ స్థాయి వరకు తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చింది.
కాగా ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్ సీతాదేవిగా కనిపించబోతుంది. ప్రభాస్ రాముడిగా చేస్తుంటే సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వడమే కాకుండా టికెట్స్ కూడా స్పీడ్ గా అమ్ముడుపోతున్నాయి. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద రామరావణ యుద్ధం ఎలా ఉండబోతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి