తమిళ సినిమాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు కొంత కాలం క్రితం విరుమన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమా తమిళ్ లో థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా తమిళ్ లో థియేటర్ లలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో పసలపూడి వీరబాబు పేరుతో నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు.

థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ కు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో అదితి శంకర్ ... కార్తీ సరసన హీరోయిన్ గా నటించగా ... ముత్తయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే తమిళ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించి తెలుగు ప్రేక్షకులను పర్వాలేదు రే అనే రేంజ్ లో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయింది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ సాటిలైట్ సంస్థలలో ఒకటి అయినటువంటి స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను జూన్ 18 వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: