తెలుగు సినిమా ఇండస్ట్రీ.లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ తాజాగా "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి గర్రి బిహెచ్ దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఈ నెల 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఈ మూవీ మేకర్స్ పాన్ ఇండియా మూవీ గా రూపొందించారు. అందులో భాగంగా ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇప్పటికే కార్తికేయ 2 మూవీ తో  నిఖిల్ కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించింది. దానితో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు 18 పేజెస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుస విజయాల తర్వాత ఈ హీరో నుండి వస్తున్న సినిమా కావడంతో "స్పై" సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే స్పై మూవీ లో నిఖిల్ ఒక టాలీవుడ్ హీరోకు వీరాభిమానిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... స్పై మూవీ లో నిఖిల్ ... నందమూరి నటసింహం బాలకృష్ణ కు వీరాభిమానిగా కనిపించబోతున్నట్లు ... అలాగే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మూవీ లకు సంబంధించిన కొన్ని రిఫరెన్స్ లను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ లో నిఖిల్ ... బాలకృష్ణ కు వీరాభిమానిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న స్పై మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే జూన్ 29 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: