ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి భారీ అంచనాలతో రూపొందుతున్న మూవీ లలో సలార్ మూవీ ఒకటి. అలాగే ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమ నుండి భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమా లలో జవాన్ మూవీ ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో కనిపించనుండగా ... రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ యొక్క టీజర్ ను జూలై 7 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుక్ ఖాన్ ... అట్లి దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...  ప్రియమణి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా అంటే జవాన్ మూవీ టీజర్ ను కూడా జూలై 7 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన సలార్ మరియు జవాన్ మూవీ ల టీజర్ లను ఒకే రోజు విడుదల కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ రెండు మూవీ ల టీజర్ విడుదలకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: