ఈ పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తూ చదువులలో పిల్లలని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మరో 30 పాఠశాలలను ఈమె దత్తత తీసుకొని మంచి మనసు చాటుకున్నారు.ఇలా కొన్ని జిల్లాలలో పాఠశాలలను దత్తత తీసుకొని పాఠశాలలలో చదివే పిల్లలకు డిజిటల్ చదువులను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల పిల్లలలో విద్యా ప్రమాణాలు పెరుగుతాయని భావించిన మంచు లక్ష్మి ప్రతి ఏడాది పెద్ద ఎత్తున స్కూల్స్ దత్తత తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జోగులాంబ గద్వేల్ జిల్లా నుంచి 30 పాఠశాలలను ఎంపిక చేసి ఆ పాఠశాలకు కావలసిన సదుపాయాలన్నింటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే గద్వేల్ జిల్లా కలెక్టర్ తో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ఈమె ఈ విషయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన మంచు లక్ష్మి ప్రైవేట్ విద్యార్థులతో సమానంగా ఇంగ్లీష్ భాషలో రాయడం, చదవం, రావాలి అన్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా మూడు స్థాయిలలో విద్యాబోధన ఉంటుందని ఈమె తెలిపారు. ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ లో బోధన ఉంటుందని తెలియజేశారు. ఇక తాము ఎంపిక చేసుకున్నటువంటి పాఠశాలలకు టీవీ, వాల్పేయింటింగ్, కార్పెట్స్, బోధన సామగ్రి సమకూరుస్తామన్నారు. 30 పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు అగ్రిమెంట్పై సంతకం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి