తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఆఖరుగా వారసు అనే తమిళ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లిమూవీ కి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ.ని దర్శకుడు వంశీ పైడిపల్లి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా నిర్మించాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లోనూ విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమాను వారసుడు పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ ని తమిళ్ లో మొదటగా జనవరి 11.వ తేదీన విడుదల చేయగా ... తెలుగు లో జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ ... తెలుగు బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ తెలుగు వర్షన్ ను కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం చేశారు. ఈ మూవీ తెలుగు వర్షన్ బుల్లి తెరపై మొదటి సారి ప్రసారం అయినప్పుడు తెలుగు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే మొదటి సారి జెమినీ టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సంస్థ ప్రచారం చేసింది.

అందులో భాగంగా ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.12 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది.  డబ్బింగ్ మూవీ అయినప్పటికీ ఈ రేంజ్ లో "టి ఆర్ పి" రేటింగ్  ను తెచ్చుకుంది అంటే ఈ  మూవీ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్మూవీ లో విజయ్ కి సోదరుడు పాత్రలో నటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: