టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాల లో నటిస్తూ మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతు ల్లో సంపాదిస్తున్న విషయం తెలిసిందే.సినిమాల ద్వారానే కాకుండా యాడ్  ద్వారా కూడా కోట్ల ల్లో పారితోషికాన్ని అందుకుంటున్నారు. కాగా మహేష్ ఇప్పటి కే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే మహేష్ యాడ్స్ చేయడాని కి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే మహేష్, మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న విషయం తెలిసిందే.ఆంధ్ర హాస్పిటల్‌ తో కలిసి ఇప్పటికి 1000కి పైగా గుండె ఆపరేషన్లు చేయించారు. వాటికి అయ్యే ఖర్చు కోసమే యాడ్స్ చేస్తుంటాడనే మాట ఫిలిం వర్గా ల్లో వినిపిస్తోంది.

చాలా మంది సెలబ్రిటీలు డబ్బుల కోసమే యాడ్స్ చేస్తుంటారు. అలాగే పలు కంపెనీలు కూడా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్లాది రూపాయలు ఇచ్చి స్టార్లను తమ బ్రాండ్ల కు అంబాసిడర్‌ గా నియమించుకుంటుంటాయి. కాగా, సేవా కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్‌ గా, అదీ ఉచితంగా అంటే దాదాపుగా ఎవ్వరూ ముందకు రారు. కానీ, మహేష్ బాబు మాత్రం తన మనసు తో ముందుకొచ్చారు.Heal A Child అనే ఒక NGO సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ సంస్ధ పేద పిల్లలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది. తాజాగా Heal A Child సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమానికి భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నారు. దీంతో మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని, మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి అని,రీల్ లైఫ్‌ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా మహేష్ బాబు హీరోనే అని అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: