తన సంగీతంతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో హారిజ్ జయరాజ్ ఒకరు . ఈ సంగీత దర్శకుడు ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి తన సంగీతంతో ఎన్నో సినిమా లకు విజయాన్ని అందించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును అందుకున్నాడు . ఇక పోతే ఈ సంగీత దర్శకుడు ఎక్కువ శాతం తమిళ సినిమాలకు సంగీతం అందించాడు . అలాగే కొన్ని తెలుగు సినిమా లకు కూడా సంగీతం అందించాడు . తెలుగు లో ఈ సంగీత దర్శకుడు సంగీతం అందించిన సినిమా లలో ఆరెంజ్ మూవీ ఆల్బమ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయినప్పటికీ ఈ మూవీ సంగీతాని కి మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది . ఇప్పటికే కూడా ఈ మూవీ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది . ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా తెలుగు మూవీ లకు సంగీతం అందించని హారిజ్ జయరాజ్ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఆ మూవీ లు ఏవో తెలుసు కుందాం.

ప్రస్తుతం నితిన్ కెరీర్ 32 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు ఈ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నాడు . ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి . అలాగే ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య కెరియర్ లో 24 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు హారిజ్ జయరాజ్ ప్రస్తుతం సంగీతం అందిస్తున్నాడు.

ఇలా ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఈ రెండు తెలుగు మూవీ లకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: