మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు  పెట్టబోతుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క టీజర్ ను "టైగర్ ఇన్విజన్" పేరుతో ఆగస్టు 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

ఇకపోతే రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి సారి రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ.లో రవితేజ బందిపోటు పాత్రలో కనిపించబోతున్నాడు. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే రవితేజ ప్రస్తుతం ఈ మూవీ తో పాటు ఈగల్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. కార్తీక్ ఘటమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ... రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: