వాస్తవానికి ఈ నెల 28వ తేదీన ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ ఉండడంతో రామ్ నటించిన స్కంద సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిన్నటి రోజున అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. గాంధీ జయంతి వారాంతపు సెలవులు ఆ తర్వాత వచ్చే దసరా సెలవులు ఇవన్నీ కూడా తమ సినిమాకి కలిసి వస్తాయని అందుకే 28వ తేదీన ఫర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అనుకొని లాంచ్ చేసామని చిత్రబృందం తెలియజేయడం జరిగింది.
హీరో రామ్ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధికంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా అని తెలుస్తోంది ఇప్పటివరకు విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ కు అదిరిపోయే స్పందన లభించింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతాన్ని థమన్ అందించడం జరిగింది. రామ్ నటించిన గత చిత్రం ది వారియర్ కూడా భారీ డిజాస్టర్ ని మూటకట్టుకుంది. దీంతో ఎలాగైనా స్కంద సినిమాతో తన స్టామినా చూపించాలని చూస్తున్నారు రామ్. అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నట్టు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి