బాలీవుడ్ బాద్షా షారుఖాన్ లేటెస్ట్ గా నటించిన సినిమా జవాన్. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై ఇప్పటికే మంచి టాక్ తో దూసుకుపోతోంది. మొదటి నుండి ఈ సినిమా పై భారీ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.'పఠాన్' వంటి భారీ సక్సెస్ తరువాత షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ట్రైలర్ కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో 'జవాన్' రూపంకో షారుక్ ఖాన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అనే మాట వినిపిస్తోంది. నార్త్ తోపాటు తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనూ 'జవాన్' కి అంచనాలకు మించిన రెస్పాన్స్ దక్కుతోంది.
కోలీవుడ్లో వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ మీదున్న అట్లీ 'జవాన్' తో అదే కంటిన్యూ చేయబోతున్నాడని అటు తమిళ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో 'జవాన్' మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'జవాన్' టీం కి బెస్ట్ విషెస్ తెలియజేసిన మహేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.." ఇది జవాన్ టైం. షారుక్ పవర్ పూర్తిస్థాయిలో సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నాం. అన్ని ఏరియాలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని, జవాన్ యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుటుంబ సమేతంగా ఈ చిత్రం చూడబోతున్నాను" అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు మహేష్ బాబు.
ఇక మహేష్ పెట్టిన ఈ ట్వీట్ కి వెంటనే రెస్పాండ్ అయ్యారు షారుఖ్ ఖాన్. ఈ మేరకు మహేష్ ట్వీట్ ని తన ట్విట్టర్లో రీ పోస్ట్ చేస్తూ.." థాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్. మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు సినిమా చూస్తున్నప్పుడు నాకు కూడా చెప్పండి, నేను వచ్చి మీతో చూస్తాను. మీకు, మీ కుటుంబానికి నా ప్రేమను తెలియజేస్తున్నాను" అంటూ షారుక్ రిప్లై ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్, షారుక్ ల ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు 'జవాన్' మూవీ పై మహేష్ బాబు ట్విట్ ఆ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఇంకాస్త ప్రమోట్ చేసినట్లు అయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి