పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ చివరి వారంలో విడుదల అని చెప్పి చివరి నిమిషంలో విడుదలని వాయిదా వేశారు. దీంతో సలార్ సినిమా విడుదల కావలసిన రోజున స్కందా చంద్రముఖి 2 సినిమాలో విడుదల అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతుంది అని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ డిసెంబర్ 22న విడుదల అవుతుంది అంటూ చాలామంది అంటున్నారు. ఇక సలార్ సినిమా వల్ల ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సరికొత్త ఆందోళన మొదలైంది అని అంటున్నారు.

ఒకవేళ ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలయితే గనక ముందే ఆ రోజును టార్గెట్ చేసుకున్న సినిమాల విడుదల తేదీలు మార్చవలసి వస్తుంది అని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా నిర్మాతలు వేరే తేదీ కోసం మళ్లీ వెతుక్కోవాల్సి వస్తుంది. ఎప్పటినుండో క్రిస్మస్ సెలవుల్లో విడుదల చేయాలి అని అనుకున్న నిర్మాతలు సలార్ సినిమా విడుదలయితే వారి సినిమాలను ఆపేయవలసి వస్తుంది. డిసెంబర్ 21, 22, 23వ తేదీలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు చాలా మంది ప్లాన్ చేసుకున్నారు. తాజాగా డైనోసార్ సడన్గా విడుదల తేదీని డిసెంబర్ 22

 అని ప్రకటిస్తే ఆ సినిమాల పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంపై చాలామంది విమర్శలు కురిపిస్తున్నారు. డిసెంబర్ 21న నని మృణల్ ఠాకూర్ జంటగా వచ్చిన హాయ్ నాన్న సినిమా సైతం విడుదల అవుతుంది. డిసెంబర్ 22న వెంకటేష్  సినిమా సైతం లైన్లో ఉంది. డిసెంబర్ 23 నా నితిన్ వక్కంతం వంశీ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా సైతం విడుదల కానుంది. ఈ మూడు సినిమాలు ఎప్పుడు వస్తాయి అన్నది ముందే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు సలార్ పై వస్తున్న ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త విని ఈ సినిమాల నిర్మాతలు ఆందోళన పడుతున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: