హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నిత్యమీనన్ గురించి చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు మంచి కథలతో పాటు స్కోప్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. వివాదాలకు సైతం నిత్యమీనన్ చాలా దూరంగా ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా నిత్యమీనన్ కి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళ సినీ ఇండస్ట్రీపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అంటూ చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పుకార్లు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతున్నాయో తెలిసిందే.

అయితే నిత్యమీనన్ ఈ వ్యాఖ్యలను చేయలేదు అని తాజాగా ఇప్పుడు మరొక వార్త వినబడుతోంది. అయితే ఒక తమిళ్ హీరో నన్ను చాలా వేధించాడు అని షూటింగ్లో నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు అని తమిళ ఇండస్ట్రీలో నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను అని తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు అంటూ నిత్యమీనన్ చెప్పినట్లుగా కొన్ని వార్తలు వినిపించాయి. వాటిని నిత్యమీనన్ సైతం ఖండించింది. ఇది అవాస్తవం జర్నలిజంలోని కొన్ని వర్గాలు ఇలా దిగజారడం చాలా బాధగా ఉంది.. ఇలాంటి చెత్త పనులను ఎలా చేయాలి అనిపిస్తుంది.. నేను ఇప్పటివరకు ఎక్కడ ఇంటర్వ్యూ నే ఇవ్వలేదు..

అలాంటి తప్పుడు వార్తలు రాయకండి.. దీని కంటే మెరుగ్గా ఉండండి.. ఇలాంటివి పక్కన పెట్టి కాస్త మంచి పనులు చేయండి అంటూ నిత్యమీనన్  సోషల్ మీడియా వేదికగా తాజాగా పేర్కొంది. దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ తాజాగా ఇప్పుడు మరొక పోస్ట్ షేర్ చేసింది. కొన్ని సోషల్ మీడియా ఖాతాలను స్క్రీన్ షాట్ తీసి మరీ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది మనం అందరం ఈ భూమి మీద చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటాం.. ఒకరికొకరం ఎలాంటి పెద్ద తప్పులు చేస్తున్నామూ అంటే షాకింగ్ గా ఉంది.. నేను దీనిని ఎందుకు ఎత్తి చూపుతున్నాను అంటే జవాబుదారీతనం మాత్రమే చెడు పవర్తనను ఆపుతుంది.. ఈ తప్పుడు ప్రచారం చేసిన వారు ఇప్పటికైనా మారండి అంటూ నిత్యామీనన్ వెల్లడించింది. దీంతో ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని తేలిపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: