టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న నటులలో నితిన్ ఒకరు. ఈయన ఇప్పటికే అనేక సినిమాలలో నటించి అందులో ఎన్నో సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈయన ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది.


 ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. హరిజ్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

 ఈ మూవీ యొక్క టీజర్ ను అక్టోబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో నితిన్ లుంగీ పంచే కట్టుకొని ఎర్ర చొక్కాను వేసుకొని మెడలో ఒక కండువాను వేసుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లో జాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: