ఇప్పటివరకు ఎన్నో డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యి హైయెస్ట్ కలెక్షన్ లను వసులు చేసిన టాప్ 7 డబ్బింగ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన "కే జీ ఎఫ్ చాప్టర్ 2" అనే కన్నడ డబ్బింగ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.25 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన రోబో 2.0 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహించాడు.

రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 47.90 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

కాంతారా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.65 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఐ మనోహరుడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 28.10 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

దళపతి విజయ్ హీరోగా రూపొందిన లియో మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ 11 రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.67 కోట్ల షేర్ కలక్షన్ లను వాదులు చేసింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ... అనిరుధ్ రవిచంద్రన్మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: