ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరీ  వివాహం చాలా గ్రాండ్ గా వీరిద్దరూ కలిసి దాదాపుగా ఆరేళ్ల ప్రేమించుకొని మరి ఈ రోజున వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గత మూడు రోజుల నుంచి ఇటలీలో సంగీత కచేరి కాకటైల్ హల్దీ మెహందీ వేడుకలతో చాలా సందడి సందడిగా జరుగుతున్నాయి.. ఈ వేడుక సెలబ్రేషన్స్ మెగా కుటుంబంతోపాటు మెగా సన్నిహితులు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరు కావడం జరిగింది. అందుకు సంబంధించి పలు రకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి.


తాజాగా వీరి వివాహానికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే పెళ్లి మండపం వరుణ్ తేజ్ మండపానికి వచ్చే వీడియోలు సైతం తెగ హల్చల్ చేస్తున్నాయి ఒక వెహికల్ లో వరుణ్ తేజ్ ని మండపం దగ్గరికి తీసుకు రావడం జరిగింది వీటితో పాటు విందు భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా అందుకు సంబంధించి ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది. మరొకపక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒక ఫోటోని రిలీజ్ చేయండి అంటే కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అందరూ అనుకున్నట్టుగానే వారి చూపులకు సైతం ఫలితం దక్కింది.. పవన్ కళ్యాణ్ ఫోటోలు రావడంతో పవన్ కళ్యాణ్ బ్యాక్ సైడ్ మాత్రమే పలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వ్యక్తి ఇంకా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఈ వివాహం తర్వాత రాత్రికి అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి హైదరాబాదుకి తిరిగి వచ్చాక ఇక్కడ నవంబర్ 5వ తేదీన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా పర్సనల్ గా ఒక పార్టీని నిర్వహించినట్లు మెగా కుటుంబం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: