ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయమైన రణబీర్ కపూర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. నిన్నటి తరం స్టార్ హీరో అయిన రిషి కపూర్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రణబీర్ కపూర్. ఇక అచ్చం తండ్రి లాగానే మొదటి నుంచి లవ్ స్టోరీస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అంతేకాదు బాలీవుడ్ లవర్ బాయ్ అనే ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. అయితే మధ్యలో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమాతో కాస్త కమర్షియల్ హిట్ కొట్టాలని అనుకున్నప్పటికీ.. ఈ సినిమా అతనికి కమర్షియల్ గా మాత్రం అంతలా బ్రేక్ ఇవ్వలేకపోయింది.


 ఇక ఇప్పుడు యానిమల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఇక గతంలో సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక ప్రస్తుతం హీరో రణబీర్ కపూర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఎందుకు సినిమా చేయాలని అనుకున్నాడో అన్న విషయాన్ని ఇటీవల వెల్లడించారు రణభీర్ కపూర్. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మూవీలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటి వల్లే సందీప్ తో సినిమా చేయడానికి నేను ఒప్పుకోలేదు. నాకు సందీప్ యానిమల్ స్టోరీ వినిపించిన విధానంతో పాటు మూవీ స్క్రిప్ట్ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు నాలో ఉన్న మరొక యాంగిల్ ని ప్రేక్షకులకు చూపించడానికి ఈ సినిమా ఉపయోగపడుతుందని నమ్మాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మూవీ తర్వాత సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబర్ ఒకటవ తేదీన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: