టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తాజాగా "కోట బొమ్మాలి పి ఎస్" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ తాజాగా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొంది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటి.వరకు వరల్డ్ వైడ్ గా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో 1.05 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.47 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు రోజుల్లో 2.52 కోట్ల షేర్ ... 5.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 50 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.02 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమా 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 48 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని వరల్డ్ వైడ్ గా క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ మూవీ లో రాహుల్ విజయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ , శివాని రాజశేఖర్ , మురళీ శర్మ ముఖ్యపాత్రలో నటించగా తేజ మార్ని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బన్నీ వాస్ ,  విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ మూవీ కి రంజిన్ రాజ్ సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: