వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నితిన్ వచ్చేనెల విడుదలకాబోతున్న తన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ ఆర్డినరీ మేన్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీతో తన ఫ్లాప్ ల సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందని నితిన్ అంచనా. ఈ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై కొన్ని కామెంట్స్ చేశాడు.


తాను హీరో అవ్వకముందు నుంచి తాను పవన్ అభిమాని ని అన్న విషయాన్ని మరొకసారి తెలియచేస్తూ తాను హీరోగా పేరు తెచ్చుకున్నంత మాత్రాన తాను పవన్ కళ్యాణ్ అభిమాని ని అని చెప్పుకోవడానికి తాను ఏమాత్రం సంశయించను అని కామెంట్ చేశాడు. అంతేకాదు తాను కెరియర్ లో మరింత ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ తాను పవన్ అభిమానిని అని గర్వంగా చెప్పుకుంటాను అంటూ నితిన్ అన్నమాటలు పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి.


ఇప్పుడు నితిన్ చేసిన కామెంట్స్ ను పవన్ అభిమానులు వైరల్ గా మార్చడమే కాకుండా ఆ కామెంట్స్ ను అల్లు అర్జున్ కు ట్యాగ్ చేశారు. అంతేకాదు అల్లు అర్జున్ తన కెరియర్ ప్రారంభంలో పవన్ అభిమానిని అని చెప్పి ఇప్పుడు టాప్ హీరో అయిన తరువాత బన్నీ ‘చెప్పను బ్రదర్’ అంటూ చేసిన కామెంట్స్ ను గుర్తుకు చేశారు. ఇప్పుడు ఈవిషయం అల్లు అర్జున్ అభిమానుల దృష్టి వరకు రావడంతో వారు ఈవిషయం పై వేరే విధంగా స్పందిస్తున్నారు.


చిరంజీవి అభిమానుల అండతో ఎదిగిన పవన్ ఏనాడు తన అన్న చిరంజీవి వల్ల టాప్ హీరోని అయ్యాను అంటూ చెప్పలేదనీ అయితే తమ హీరో బన్నీ మాత్రం ‘తన కట్టె కాలేవరకు తాను చిరంజీవి అభిమానిగానే కొనసాగుతాను’ అంటూ అనేకసార్లు చేసిన కామెంట్స్ ను బన్నీ అభిమానులు గుర్తు చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: