మెగాస్టార్ చిరంజీవి యు
వి క్రియేషన్స్ బ్యానర్ లో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
త్రిష హీరోయిన్ గా కనిపించనుండగా ... ఎం ఎం
కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఈ
మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అలాగే ఈ
మూవీ బృందం వారు ఈ
మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. కాకపోతే ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్ లలో
చిరంజీవి పాల్గొనలేదు. ఇకపోతే తాజాగా ఈ రోజు నుండి ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్
అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ కోసం ఈ
మూవీ బృందం ఇప్పటికే ఓ భారీ ల్ సెట్ ను
అన్నపూర్ణ స్టూడియోలో వేయించారు. ఇకపోతే తాజాగా
అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయినటువంటి షెడ్యూల్ లో
చిరంజీవి కూడా ఎంటర్ అయ్యాడు.

ఈ విషయాన్ని ఈ
మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా
సంక్రాంతి పండుగకు సినిమాల విడుదల విషయంలో అనేక వివాదాలు రేగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో
మూవీ బృందాలు కూడా చాలా త్వరగా తమ సినిమాలను సంక్రాంతికి ఏ తేదీన విడుదల చేయబోతున్నాం అనే విషయాలను ప్రకటిస్తూ వచిస్తున్నారు. అందులో భాగంగా వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగకు అందరికంటే ముందుగా
చిరంజీవి తన సినిమాకి బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నాడు. వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 10 వ తేదీన విశ్వంభర
మూవీ ని
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా
చిరంజీవి ఇప్పటికే నెక్స్ట్
సంక్రాంతి కి తన
సినిమా విడుదల తేదీని అందరికంటే ముందు ప్రకటించాడు.