టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ ప్రస్తుతం "లవ్ మీ" అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బేబీ మూవీ లో హీరోయిన్ గా నటించి సూపర్ సక్సెస్ ను అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నటు వంటి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడ బోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రౌడీ బాయ్స్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి యావరేజ్ విజయాన్ని అందుకున్న ఆశిష్ ఆ తర్వాత సెల్ఫీస్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. కానీ ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరి "లవ్ మీ" మూవీ తో ఈ నటుడు ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: