మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. 

ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే చాలా రోజుల క్రితం ఈ మూవీ నుండి "జరగండి జరగండి తప్పుకోండి" అంటూ సాగే ఓ సాంగ్ లిక్ అయింది. దానితో ఈ చిత్ర బృందం ఈ సాంగ్ ను అఫీషియల్ గా విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమీ తెలియదు కానీ ఈ సాంగ్ ను మాత్రం ఈ చిత్ర బృందం విడుదల చేయలేదు.

ఇకపోతే గత కొంత కాలంగా ఈ సంవత్సరం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా "గేమ్ చేంజర్" మూవీ లోని "జరగండి" అంటూ సాగే సాంగ్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువబడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు గేమ్ ఈ సినిమాలోని మొదటి సాంగ్ అయినటువంటి "జరగండి" అంటూ సాగే సాంగ్ ను రేపు అనగా మార్చి 27 వ తేదీన ఉదయం 9 గంటల 03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: