కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన వరుసగా మంచి విజయాలను అందుకుంటూ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే ఈ నటుడు తాను నటించిన చాలా సినిమాలను తెలుగు లో విడుదల చేయగా అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను అందుకోవడంతో ఈ నటుడి కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ఉంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈయన అయలాన్ అనే సినిమా లో హీరో గా నటించాడు.

మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మొదటగా తమిళ్ లో ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల కాగా ... ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ మూవీ తెలుగు వర్షన్ థియేటర్ లలో విడుదల అయ్యింది. తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ తెలుగు వర్షన్ కు పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే కలెక్షన్ లు వచ్చాయి. ఇక చాలా రోజుల క్రితమే ఈ సినిమా తెలుగు వర్షన్ తప్ప మిగతా భాషలకు సంబంధించిన "ఓ టి టి" వర్షన్ అందుబాటు లోకి వచ్చింది.

ఇక మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కూడా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ నెల 19క్వ తేదీ నుండి తెలుగు భాషలో "ఓ టి టి" లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk