స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది.సినిమా విడుదల అయిన కేవలం ఆరు రోజుల్లోనే 91 కోట్ల కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.ఈ శుక్రవారం నాటితో ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటరవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది.బ్లాక్ బస్టర్ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్‌ అదిరిపోయింది. అలాగే హీరోయిన్ అనుపమ గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. టిల్లు స్క్వేర్‌లో కంప్లీట్ బోల్డ్ లుక్‌లో కనిపించి అనుపమ అందరిని సర్‌ప్రైజ్ చేసింది. సిద్ధు పంచ్ డైలాగ్స్ హిలేరియస్‌గా వున్నాయి. టిల్లు స్క్వేర్ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. 

ఈ సీక్వెల్ మూవీకి సిద్ధు జొన్నలగడ్డ కథ తో పాటు స్క్రీన్‌ప్లేను కూడా అందించాడు..టిల్లు స్క్వేర్ విజయం సాధించడం తో టిల్లు ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతుంది.ఈ థర్డ్ పార్ట్‌ కు టిల్లు క్యూబ్ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది.. టిల్లు పార్ట్ 3లో సిద్ధు జొన్నలగడ్డ సూపర్ హీరోగా కనిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే టిల్లు స్వ్కేర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది.భారీ రేటుకు టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్‌ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డేట్‌ను దాదాపుగా నెట్‌ఫ్లిక్స్ కన్ఫామ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం..త్వరలోనే టిల్లు స్వ్కేర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: