తమిళ్ లో హర్రర్ ద్రిల్లర్ జోనర్ లో వచ్చిన మూవీ లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సిరీస్ చిత్రాలలో "అరుణ్మనై" సిరీస్ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ నుండి మూడు మూవీ లు రాగా ... ఈ మూడు కూడా తమిళ్ లో ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇకపోతే ఈ సిరీస్ లో వచ్చిన మూడు మూవీ లను కూడా తెలుగు లో వివిధ పేర్లతో విడుదల చేశారు. అందులో కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించగా మరికొన్ని పెద్దగా అలరించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా "అరుణ్మనై 4" అనే చిత్రాన్ని తమిళ్ లో రూపొందించారు. 

సుందర్ సి ఎస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా మరియు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని రాశి కన్నా కీలక పాత్రలలో కనిపించనుండగా ... వెన్నెల కిషోర్మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి సుందర్ కూడా ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే ఈ సినిమా యొక్క తమిళ్ వర్షన్ ను "అరుణ్మనై 4" అనే పేరుతోనే విడుదల చేయనుండగా తెలుగుకు మాత్రం వేరే టైటిల్ ను అనౌన్స్ చేశారు.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను "బాక్" అనే పేరుతో తెలుగులో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ లో తమన్నా , రాశి కన్నా , వెన్నెల కిషోర్ , సుందర్ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే తమ్ముళ్ లో సక్సెస్ ఫుల్ సిరీస్ మూవీ లలో ఒకటి అయినందున ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: