చందమామ కాజల్ అగర్వాల్ నటించిన హారర్ థ్రిల్లర్ “కాజల్ కార్తీక” ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ఈ మూవీలో కాజల్ తో పాటు హాట్ బ్యూటీ రెజీనా కసాండ్రా కూడా కీలక పాత్ర లో నటించింది.కాజల్ అగర్వాల్, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ 'కరుంగాపియం'..ఈ సినిమా గత ఏడాది మే 19 న తమిళనాట థియేటర్లలో విడుదల అయ్యింది. అక్కడ మంచి విజయం అందుకుంది. దీనితో ఆ సినిమాను తెలుగు లో 'కాజల్ కార్తీక' పేరుతో డబ్బింగ్ చేశారు.ఈ సినిమాలో జననీ అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్ మరియు పార్వతి తిరువొతు  వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషించారు.నేడు ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న 'కాజల్ కార్తీక' చిత్రాన్ని ఆహా ఓటీటీలో విడుదల చేసింది. ‘కాజల్ కార్తీక ‘తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడం తో కాజల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాజల్ కార్తీక' చిత్రానికి డీకే రచన మరియు దర్శకత్వం వహించారు.. పదార్తి పద్మజ నిర్మాత గా వ్యవహరించారు.. హర్రర్ అంశాలతో పాటు ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయని నిర్మాత పద్మజ తెలిపారు.. ''కాజల్ అగర్వాల్ గారు హారర్ క్యారెక్టర్లో నటించడం ప్రేక్షకులకు నూతన అనుభూతిని ఇస్తుంది ఆమె తెలిపారు.. ఈ సినిమాకు విఘ్నేష్ వాసు సినిమాటోగ్రఫీ అందించగా ప్రసాద్.ఎస్.ఎన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.హారర్ కామెడీ సినిమాలు ఎక్కువగా చూసే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది'' అని చెప్పారు.'కాజల్ కార్తీక' ట్రైలర్ సినిమా పై ప్రేక్షకులలో ఆసక్తి పెంచింది.ఈ సినిమాలోని ఐదు వేర్వేరు కథలతో కాజల్, రెజీనాకి మధ్య సంబంధం ఏమిటి.. ఊరుప్రజలు అందరూ కాజల్ ను కొట్టడానికి కారణం ఏమిటి.. అనేది ప్రేక్షకులలో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: