తమిళ సినీ పరిశ్రమలో మంచు గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి కుష్బూ భర్త ప్రముఖ దర్శకుడు సుందర్ సి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే అనేక సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడుగా కూడా మంచు గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తమిళ్ లో హర్రర్ ద్రిల్లర్ జోనర్ లో వచ్చిన మూవీ లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సిరీస్ చిత్రాలలో ఒకటి అయినటువంటి  "అరుణ్మనై" కి సుందర్ దర్శకత్వం వహిస్తున్నాడు .

ఇప్పటికే ఈ సిరీస్ నుండి మూడు మూవీ లు రాగా ... ఈ మూడు కూడా తమిళ్ లో ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇకపోతే ఈ సిరీస్ లో వచ్చిన మూడు మూవీ లను కూడా తెలుగు లో వివిధ పేర్లతో విడుదల చేశారు. అందులో కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించగా మరికొన్ని పెద్దగా అలరించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా "అరుణ్మనై 4" అనే చిత్రాన్ని తమిళ్ లో రూపొందించారు.

ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా మరియు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని రాశి కన్నా కీలక పాత్రలలో కనిపించనుండగా ... వెన్నెల కిషోర్మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి సుందర్ కూడా ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సుందర్ శివశంకర్ పాత్రలో కనిపించనున్నాడు ఎందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.  

ఇకపోతే ఈ సినిమా యొక్క తమిళ్ వర్షన్ ను "అరుణ్మనై 4" అనే పేరుతోనే విడుదల చేయనుండగా తెలుగుకు మాత్రం వేరే టైటిల్ ను అనౌన్స్ చేశారు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను "బాక్" అనే పేరుతో తెలుగులో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బృందం అనౌన్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: