టాలెంటెడ్ నటుడు అల్లరి నరేష్ ప్రస్తుతం "ఆ ఒక్కటి అడక్కు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయనున్న ట్లు ఈ చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా బృందం వారు మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేశారు.

సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో ... బాగా సీరియస్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ నటిస్తున్న ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా కావడంతో "ఆ ఒక్కటి అడక్కు" మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: