మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది నటులు కేవలం సినిమాలలో నటించి డబ్బులు సంపాదించడం మాత్రమే కాకుండా కొన్ని ఇతర బిజినెస్ లలో కూడా అడుగు పెట్టి డబ్బులను సంపాదించుకుంటున్నారు. అందులో భాగంగా దాదాపు చాలా మంది హీరోలు ఇప్పటికే థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో భాగంగా కొంత మంది ఇందులో సూపర్ సక్సెస్ కూడా అయ్యారు. ఇకపోతే చాలా కాలం క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు , ఏషియన్ సంస్థతో కలిసి "ఏ ఏం బి" అనే థియేటర్ ను నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం హైదరాబాదు లోనే అద్భుతమైన రీతిలో ఏ థియేటర్ నడుస్తోంది. దీని తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ కూడా ఆసియన్ సంస్థతో కలిసి "ఏ ఏ ఏ" అనే థియేటర్ ను నిర్మించాడు. ఇక ప్రస్తుతం ఈ థియేటర్ కూడా విజయవంతంగా నడుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే మాస్ మహారాజా రవితేజ కూడా ఏషియన్ సంస్థతో కలిసి ఓ థియేటర్ ను నిర్మించాడు. ఇలా వీరి ముగ్గురు బాటలోనే టాలీవుడ్ యువ నటుడు నితిన్ కూడా పయనించబోతున్నాడు.

నితిన్ కూడా ఏషియన్ సంస్థతో కలిసి ఓ థియేటర్ ను నిర్మిస్తున్నాడు. సంగారెడ్డి ఏరియాలో ఏషియన్ నితిన్ సితార పేరుతో మల్టీప్లెక్స్ ను నితిన్ నిర్మించనున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ థియేటర్ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ థియేటర్ ను ఓపెన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ , తమ్ముడు అనే రెండు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ లపై కూడా ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: