వాస్తవానికి పవన్ పూర్తి చేయవలసి ఉన్న మూడు సినిమాలలో సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ కావడంతో ఈసినిమాకు సంబంధించి అంచనాలు బాగానే ఉన్నప్పటికీ పవర్ స్టార్ అభిమానులు కోరుకున్న విధంగా సుజిత్ ఎంతవరకు పవన్ కళ్యాణ్ ను గ్యాంగ్ స్టర్ గా చూపించి సక్సస్ కాగలుగుతాడు అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.
వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మనసు పెట్టి తన డేట్స్ ను ఇవ్వగలిగితే ఈమూవీ అనుకున్న విధంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాజకీయ నాయకుడుగా ఒక వెలుగు వెలుగుతున్న పవన్ ను ఎంతవరకు ప్రేక్షకులు గ్యాంగ్ ష్టర్ పాత్రలో పవర్ స్టార్ ను అంగీకరిస్తారు అన్న సందేహాలు మరికొందరకు వస్తున్నాయి.
ఈసినిమా షూటింగ్ దాదాపు 70శాతం వరకు పూర్తి కావడంతో ఇప్పుడు పవన్ కు ఏర్పడిన పొలిటికల్ ఇమేజ్ తో ఈమూవీ కథ మార్చడం జరిగే పనికాదు అన్న లీకులు వస్తున్నాయి. ఇక పవన్ ఎప్పుడో మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. ఈమూవీ కధకు చారిత్రాత్మక నేపధ్యం ఉండటంతో ఈమూవీలో పవన్ డిఫరెంట్ గెటప్ లో కనిపించవలసి వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ క్షణం తీరికాలేని రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉండటంతో అతడి మొహంలో అలసట స్పష్టంగా కలిపిస్తోంది. ఇలా రకరకాల సమస్యలతో పవన్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు ప్రస్తుతం టెన్షన్ లో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి