పీ ఏ రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా..  మాళవిక మోహనన్ హీరోయిన్గా వచ్చిన పిరియాడికల్ డ్రామా తంగలాన్.. హిందీ,తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో ఈరోజు అనగా ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని తమిళంలో కాంతారా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మళ్లీ తంగలాన్ కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హీట్ అయ్యేలా కనిపిస్తోంది ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు చూస్తే. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ డిఫరెంట్ గెటప్ లో దర్శనమిచ్చి అందర్నీ మరో లోకంలోకి తీసుకువెళ్లారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకి మరో లోకంలో ఉన్న ఫీలింగ్స్ కలుగుతున్నాయి. 

దాంతో సినిమాకి అద్భుతమైన ఆదరణ లభించడంతో మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం చాలామంది హీరోలు రొటీన్ కథలతో వస్తున్నారు. కానీ చియాన్ విక్రమ్ మాత్రం కాస్త డిఫరెంట్ కథతో వచ్చేసరికి ప్రేక్షకులు భ్రహ్మరథం పట్టారు. అయితే తంగలాన్ మూవీ లో హీరోగా చేయాల్సింది చియాన్ విక్రమ్ కాదట. మొదట మరో తెలుగు హీరోకి ఈ ఆఫర్ వచ్చిందట.డైరెక్టర్ రంజిత్ మొదట ఈ సినిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తీయాలి అనుకున్నారట. ఎందుకంటే డిఫరెంట్ గెటప్స్ వేస్తూ వెరైటీ కథలతో సినిమాలు చేయాలంటే అల్లు అర్జున్ పేరే అందరికీ గుర్తుకు వస్తుంది.

అలా అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరోగా పెట్టాలని డైరెక్టర్ అనుకున్నారట. ఇక స్టోరీ చెప్పగా అల్లు అర్జున్ కి కూడా చాలా నచ్చిందట.కానీ అప్పటికే పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట.అయితే కొన్ని రోజులు ఆగితే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసేవాడు కావచ్చు కానీ పుష్ప-2 సినిమాకి చాలా రోజుల సమయం పట్టింది.కాబట్టి అన్ని రోజులు డైరెక్టర్ ఆగేవారు కాదు.అలా ఈ సినిమా చియాన్ విక్రమ్ తో తీశారట

మరింత సమాచారం తెలుసుకోండి: