తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం ది గో అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో స్నేహ ,  మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

మూవీ ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. మరి ఈ సినిమా యొక్క ట్రైలర్ కు విడుదల 24 గంటల్లో ఎన్ని వ్యూస్ , లైక్స్ లభించాయి అనే వివరాలను తెలుసుకుందాం. ది గోట్ మూవీ తమిళ్ వెర్షన్ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 29.28 మిలియన్ వ్యూస్ దక్కాయి. అలాగే ఈ మూవీ యొక్క తమిళ్ వర్షన్ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 1.236 మిలియన్ లైక్స్ లభించాయి.

ఇలా ఈ మూవీ యొక్క ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో అదిరిపోయే రేంజ్ వ్యూస్ , లైక్స్ లభించాయి. ఇకపోతే తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్లను రాబడుతుందో అనే విషయం తెలియాలి అంటే సెప్టెంబర్ 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ట్రైలర్ ను కూడా మూవీ బృందం వారు విడుదల చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: