* చిరుతతో అందరినీ అలరించిన నేహా శర్మ

* దాని తర్వాత ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేశారు

* కానీ ఈ అందాల తార కొంత కాలంలోనే తెరమరుగయ్యింది  

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు అడుగుపెట్టారు. వారిలో ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్స్ అందుకున్న వారు కూడా ఉన్నారు. అయితే తర్వాత వారికి అదృష్టం కలిసి రాక మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ నేహా శర్మ. ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది తర్వాత నాటి అయింది ఇప్పుడు వ్యాపారవేత్తగా ఈ అందాల తార కొనసాగుతోంది. కాదు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఆమె తన నటజీవితాన్ని 2007లో తెలుగు సినిమా 'చిరుత'తో ప్రారంభించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నేహా మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. 2010లో 'క్రూక్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 'క్యా సూపర్ కూల్ హై హమ్' అనే సినిమాలోని ఆమె పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

తరువాత నేహా యమ్లా పగ్లా దీవానా 2 (2013), సోలో (2017), తాన్హాజీ (2020) వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. 2020లో, ఆమె 'ఇల్లీగల్' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ స్పేస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నేహా 'కృతి', 'వికల్ప్' వంటి చిన్న చిత్రాలలోనూ ప్రధాన పాత్రలు పోషించింది. ఇటీవల "హాయ్ నాన్న" సినిమాలో ఒక చిన్న అతిధి పాత్ర చేసింది. అది తప్ప ఆమె గత కొన్ని ఏళ్లలో తెలుగు తెరపై మెరిసిన సినిమాలు లేవు. ఎందుకంటే చిరుత తర్వాత ఆమె చేసిన ఒకటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి అందుకే బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ సక్సెస్‌లు రావడంతో సెటిల్ అయ్యింది.

నేహా శర్మ బిహార్‌లోని ఒక హిందూ కుటుంబంలో జన్మించింది. భాగల్పూర్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో చదువుకుంది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేశారు. చిన్నప్పుడు ఆమెకు తీవ్రమైన ఆస్తమా వ్యాధి ఉండేది, తరచూ అనారోగ్యంగా ఉండేది. హైదరాబాద్‌లోని ఒక కుటుంబం సహాయంతో ఆమె ఈ వ్యాధి నుంచి ఇటుగా కోలుకుంది.

 ఈ రామ్ చరణ్ హీరోయిన్ కు వంట చేయడం, చదవడం, సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నేహా కథక్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. లండన్‌లోని పైనాపిల్ డాన్స్ స్టూడియోస్‌లో స్ట్రీట్ హిప్-హాప్, సాల్సా, జైవ్, మెరెంగే, జాజ్ వంటి వివిధ డాన్సులు నేర్చుకున్నారు. 2020లో, నేహా శర్మ బెర్మింగ్‌హామ్ చాలెంజర్స్ అనే IPL సాకర్ జట్టును ఇతరులతో కలిసి కొనుగోలు చేసింది. 2024లో, ఆమె హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టి, ఢిల్లీలోని వసంత విహార్‌లో అంగద్ సింగ్, అక్షయ్ షోకీన్‌, ఇతరులతో కలిసి "కాల్ మీ టెన్" అనే జపనీస్ రెస్టారెంట్‌ను స్థాపించింది. ఈ రెస్టారెంట్ 2024 సెప్టెంబర్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: