బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అది పక్కా హిట్ అవ్వాల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ మూడు సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో హ్యాట్రిక్ హిట్ కొట్టి రికార్డు క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే, అఖండ మూవీ తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు. దసరా రోజు చెప్పినట్టే అఖండ 2 మూవీని  అనౌన్స్ చేసారు. బాలయ్య,బోయపాటి కాంబోలో నాలుగో మూవీగా అఖండ 2 మూవీ రాబోతుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమంలో బాలయ్య బాబు సూపర్ డైలాగ్ చెప్పారు. " ఈ నేల అసురుడిది కాదు.. ఈశ్వరుడిది.. పరమేశ్వరుడిది.. కాదని తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం " అంటూ డైలాగ్ చెప్పి సినిమా పై అంచనాలు పెంచేశారు.ఇదిలావుండగా ఒకప్పుడు వరుస హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందిస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడు.

ఆయన ఎన్నో మాస్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించి హ్యాట్రిక్ హిట్స్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు. అలాంటి హిట్ డైరెక్టర్ ప్రస్తుతం చతికిల పడ్డారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బోయపాటి శ్రీను అంటే డైరెక్షన్ కి మారుపేరు. అయితే అలాంటి ఈయన నుంచి ఈమధ్య సినిమాలు రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీనుకి అఖండ చిత్రం చివరి చిత్రం అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక అఖండ 2 ను అనౌన్స్ అయితే చేశారు కానీ ఈ మూవీ స్టోరీ బాలయ్యకు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య చేత హ్యాట్రిక్ కొట్టించిన బోయపాటి శ్రీనుకి ఇప్పుడు ఆయనే అవకాశాలు ఇవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అఖండ 2 వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా..బాలకృష్ణ మాత్రం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: