
ప్రస్తుతం టాలీవుడ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పెద్ద బ్యానర్లు సైతం సినిమా నిర్మాణాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మందగించింది. రాజకీయ కార్యకలాపాలు అనిశ్చింతంగా ఉన్నాయి. రెగ్యులర్గా అప్పు ఇచ్చే ఫైనాన్షియర్లు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెద్దపెద్ద బ్యానర్లకు మాత్రమే అప్పులు ఇస్తున్నారు. ఇక పెద్ద సంస్థలు సైతం ఓటిటి సంస్థలు ఓకే అన్న తర్వాతే ప్రాజెక్ట్ సెక్స్ మీదకు తీసుకు వెళుతున్నాయి. చివరికి విశ్వంభర లాంటి పెద్ద సినిమాను సైతం ఓటిటి సంస్థలు ఎక్కువ రేటుకు కొనేందుకు ఇష్టపడటం లేదు. పరిస్థితి అంత దారుణంగా ఉంది. టి సీరిస్ లాంటి సంస్థ బ్యాకింగ్ మైత్రి మూవీస్ కు ఉంది. మై హోమ్ - ఆహా లాంటి సంస్థ భాగస్వామ్యం సితార సంస్థకు ఉంది. అందువల్ల ఆ రెండు సంస్థలు ఎక్కువ సినిమాలు చేస్తున్నాయి .. అయినా కూడా ఆచితూచి అడుగులు చేస్తూ పెద్ద సినిమాలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి.
దిల్ రాజు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ - నితిన్ చేయాల్సిన సినిమాలు ఇవి. మిగిలిన యాక్టివ్ బ్యానర్లు అన్నింటిలోనూ ఒకటి లేదా రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. సితార - మైత్రిని పక్కన పెడితే మిగిలిన సినిమాలు అన్నీ కలిపి లెక్కట్టిన పాతిక సినిమాలు కూడా లేవు. తర్వాత ప్రాజెక్టులు వస్తాయి .. అయితే ప్రతి ఒక్కరు ఆచితూచి ప్రాజెక్టులు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఎందుకంటే ఒకవైపు థియేటర్ల బిజినెస్ తగ్గుతోంది. సినిమాకు మరీ సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం లేదు. మరోవైపు నాన్ థియేటర్ ఆదాయం తగ్గిపోతుంది. ఇటు సినిమా బడ్జెట్ పెరుగుతోంది. అందుకే పెద్ద పెద్ద సంస్థలు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.