సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది కి కెరియర్ను ప్రారంభించిన కొత్తలోనే అద్భుతమైన అవకాశాలు రావడం , అవి మంచి విజయాలను సాధించడం , వారు స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం జరుగుతూ ఉంటుంది. ఇక మరి కొంత మంది మాత్రం అద్భుతమైన గుర్తింపును సంపాదించుకునే దశలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలా కెరియర్ ప్రారంభంలో చాలా కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగి ఇప్పటికి కూడా అద్భుతమైన గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.

ఈ ముద్దుగుమ్మ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో కాకుండా మరో స్టార్ హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. అసలు విషయం లోకి వెళితే ... ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఎంచుకున్నారు. ఆమెపై కొన్ని రోజుల షూటింగ్ ను కూడా తెరకెక్కించారు.

కానీ ఆ తర్వాత ఆమె ఆ పాత్రకు సెట్ కాదు అని , ఆమెను సినిమా మధ్యలో నుండి తీసేసి కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకున్నారట. ఇక స్టార్ హీరోతో మొదటి సినిమా అవకాశాన్ని కోల్పోయిన ఈమె ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం కూడా అదే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: