పూజ హెగ్డే ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక లైలా కోసం అనే తెలుగు సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం ముకుంద సినిమాతో అభిమానుల మనసులను దోచుకుంది. ఈ సినిమా అనంతరం బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక పూజ హెగ్డే తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈ చిన్నది తన సినిమాల ద్వారా ఎంతగానో ఆకట్టుకుంది. 



ఈ చిన్న దానికి తెలుగులో ఎక్కువగా సినిమా అవకాశాలు రావడం లేదు. అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. హిందీలో ఈ చిన్నదాని నటనకు విపరీతంగా అభిమానులు ఉన్నారు.  ఈ చిన్నది తెలుగులో అవకాశాల కోసం సతమతమవుతోంది. గ్లామర్ డోస్ పెంచుతూ వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పూజ హెగ్డేకి సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.


పూజ హెగ్డేకు సినిమాల పరంగా ఎంత కష్టపడినా పెద్దగా ఫలితం మాత్రం రావడం లేదు. డస్కీ బ్యూటీ పూజా హెగ్డే విషయంలో ఇది ప్రతిసారి జరుగుతోంది. సక్సెస్ తో సంబంధం లేకుండా పూజ హెగ్డే తన పని తాను చేసుకుంటూ పోతోంది. వరుసగా సినిమాలలో నటిస్తోంది. కాగా పూజ హెగ్డే నటించిన ఏడు సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. రాదేశ్యామ్, బీస్ట్, ఆచార్య, దేవా, రెట్రో, సర్కస్, కిసి కా బాయ్ కిసి కా జాన్ ఇలా ఆమె నటించిన ఏడు సినిమాలు వరసగా డిజాస్టర్లు అయ్యాయి. పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అవడంతో తనకు సినిమాలలో అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయం పైన నటి పూజా హెగ్డే ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: