మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. చిరంజీవి హీరో గా రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సినిమాలలో కొదమ సింహం మూవీ ఒకటి . మురళీ మోహనరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... రాధ , వాణి విశ్వనాథ్మూవీ లో హీరోయిన్లుగా నటించారు. రాజ్ , కోటి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ 1990 వ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే 1990 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన కొదమ సింహం సినిమాని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే చిరంజీవి హీరో గా రూపొందిన ఇంద్ర మూవీ ని కొన్ని రోజుల క్రితం రీ రిలీజ్ చేయగా ఆ సినిమా రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక చిరంజీవి హీరోగా రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను కూడా తాజాగా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది. మరి కొదమ సింహం సినిమా రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: