సాధారణంగా సినీ సెలబ్రెటీలు, క్రికెటర్లకు మధ్య మంచి బంధం ఉందని చెప్పవచ్చు. ఎక్కువ గా ఎఫైర్ రూమర్స్ బాలీవుడ్లో వినిపిస్తూ ఉంటాయి. చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఇండియన్ క్రికెటర్స్ తో ప్రేమాయణం కొనసాగించిన వారు ఉన్నారు. ఈ లిస్టులో మాజీ కెప్టెన్ ధోని కూడా ఉన్నారు.. గతంలో ధోని చాలామంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశారని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అలా హీరోయిన్ దీపికా పడుకొని తో పాటుగా లక్ష్మీరాయ్ పేరు కూడా ఎక్కువగా వినిపించింది. అలాగే హీరోయిన్ ఆసిన్ పేరు కూడా ఎక్కువగా వినిపించింది.


ఇక హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు చేసింది సినిమాలు తక్కువే అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చాలా రోజులు ధోనితో డేటింగ్ చేసింది.. వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల చేత బ్రేకప్ అయ్యారట.

సౌత్ ఇండియా హీరోయిన్ ఆసిన్ కూడా ధోనితో ప్రేమలో పడిందని ఆమధ్య వార్తలు వినిపించాయి. ఎందుకో ఏమో మళ్లీ చివరిగా ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.



దీపికా పదుకొనే కోసం ధోని తన హెయిర్ స్టైల్ లాంగ్ గా పెంచారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఆ సమయంలో మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా దీపికాని ఇష్టపడడంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల ధోని దీపికాను దూరం పెట్టారని బాలీవుడ్ లో వార్తలు వినిపించాయి.


ఇక ఎన్నో రూమర్ల తర్వాత 2010లో తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి రావత్ ను ధోని ప్రేమించి వివాహం చేసుకున్నారు.  ఆమె బర్తడే పార్టీలో ధోని సాక్షికి ప్రపోజ్ చేసి మరి వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అనంతరం అటు క్రికెట్ తోపాటు బిజినెస్ వైపుగా అడుగులు వేశారు ధోని.  మరి ధోని ఎఫైర్స్ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు అప్పుడప్పుడు వైరల్ గా మారుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: