
టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన దేవరకు వాస్తవంగా బెనిఫిట్ షో అయిన వెంటనే మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో తో ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ చేశారు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లకు వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు దేవర పార్టు 2పై అంచనాల మామూలుగా లేవు. ఇక దేవర 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఒక్కటే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న వార్ 2 ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే దేవర 2 సెట్స్ మీదకు వెళుతుందని అంటున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే యేడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దేవర 2 కథ కోసం దర్శకుడు కొరటాల శివ ఒక రేంజ్ లో కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కొరటాల శివ టీం దేవర 2ను మరింత బలంగా మార్చేందుకు కసరత్తులు చేస్తున్నారట. ఈ సినిమాలో జాన్మికపూర్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. దేవర సూపర్ హిట్ అవడంతో దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు