సినీ పరిశ్రమలో సక్సెస్ అవ్వాలంటే సినిమా మీద మంచి ఫ్యాషన్ ఉండాలి. సినిమాల మీద ఆసక్తి ఉన్నట్లయితేనే వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సినిమాను ప్రారంభించాలంటే ముందుగా నిర్మాత బలంగా నిలబడి ముందడుగు వేయాలి. నిర్మాత ఒప్పుకోనిదే సినిమాలో ఏ పని జరగదు. ఇక నేటి కాలంలో టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ఫుల్ నిర్మాతలలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటాడు. సినిమాల మీద ఇతనికి ఉన్న ఫ్యాషన్, పట్టు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తన చేతితో ఏ సినిమాలు ప్రారంభించిన అవి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. 

దానివల్ల దిల్ రాజు చాలా సార్లు లాభాల బాటలో పయనించారు. ఇక దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే తన మొదటి భార్య మరణించింది. తన భార్య మరణంతో దిల్ రాజు చాలా రోజులు స్ట్రగుల్ అయ్యారు. ఎంతో బాధను అనుభవించారు. ఆ సమయంలో అతను జీవితంలో ఒక తోడును కావాలనుకున్నాడు. అందులో ఎలాంటి తప్పులేదు. భవిష్యత్తులో ఎదగాలంటే, కెరీర్ లో సక్సెస్ అవ్వాలంటే తోడు తప్పకుండా ఉండాలని భావించిన దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

వీరిద్దరూ సంవత్సరం పాటు ప్రేమలో ఉండి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. దిల్ రాజు రెండవ వివాహం తర్వాత సక్సెస్ఫుల్ నిర్మాతగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. అతనికి అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇక తేజస్విని సినిమాలలో నటించలేదు. సాధారణమైన అమ్మాయి కానీ హీరోయిన్ కి మించిన అందం, చలాకీతనంతో కనిపిస్తుంది. దిల్ రాజుకు ఫుల్ సపోర్ట్ గా ఉండి తన పనులన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. 


దిల్ రాజుకు సంబంధించిన సినిమా వ్యవహారాలను చూసుకోవడంలో తేజస్విని ముందు వరుసలో ఉంటారు. ఇక తేజస్విని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోను, ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి ఈ క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే తేజస్విని సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసుకుంది. అందులో హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ పాటకు చాలా సింపుల్ గా స్టెప్పులు వేసింది. చీర కట్టులో ఎంతో అందంగా, కుందనపు బొమ్మలా ఉన్న తేజస్వినిని చూసి చాలా అందంగా ఉన్నావని వారి అభిమానులు పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది.


https://www.instagram.com/reel/DIdvk_lP2N-/?igsh=MXNmbjNwb2M5dTI3aA%3D%3D


మరింత సమాచారం తెలుసుకోండి: