టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. వీరిద్దరు కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోలుగా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ వల్ల మహేష్ బాబుకు ఇండస్ట్రీ హిట్ దక్కింది. అది ఎలా అనుకుంటున్నారా ..? పవన్ కళ్యాణ్ వదిలేసిన ఓ కథలో మహేష్ బాబు హీరోగా నటించగా ఆ మూవీ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హాట్ గా నిలిచింది. మరి పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమా ఏది ..! మహేష్ బాబు ఏ సినిమాతో ఇండస్ట్రీ హిట్ను అందుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి అనే రూపొందిన విషయం మనకు తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే పూరి జగన్నాథ్ మొదట పోకిరి సినిమా కథను మహేష్ బాబుకు కాకుండా పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదట. దానితో ఈ మూవీ కథను పూరి జగన్నాథ్ , మహేష్ కి వినిపించగా ... మహేష్ కు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో ఈ స్టోరీ తో తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పూరి జగన్నాథ్ "పోకిరి" అనే టైటిల్ తో మహేష్ బాబు హీరోగా మూవీ ని రూపొందించగా ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇలా పవన్ వదిలేసిన సినిమాలో మహేష్ హీరోగా నటించి ఏకంగా ఇంట్రెస్ట్ హిట్ను అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: