పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా బాహుబలి సినిమాతో మారిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ప్రభాస్ కి విపరీతంగా అభిమానులు, అభిమానుల సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. యూత్ ప్రభాస్ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. 

హీరో ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన చేతిలో దాదాపు మూడు, నాలుగు సినిమాలకు పైనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. స్పిరిట్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనే మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం అందుతుంది. అందులో లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించడానికి దీపికా పదుకొనే దాదాపు 20 కోట్లకు పైనే రెమ్యునరేషన్ వసూలు చేస్తుందట. దీపికాకు యూత్ లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే దీపికా పదుకొనే ఫుల్ బిజీ హీరోయిన్ గా రాణిస్తోంది. అంతేకాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ వస్తువులు చేసే హీరోయిన్ల జాబితాలో ఈ భామ ఒకరు. తనకు ఉన్న క్రేజ్ ని బట్టి స్పిరిట్ సినిమాలో నటించడానికి ఎక్కువగా డబ్బులను తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ విషయం సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: