
2007లో `యమదొంగ` సినిమా కోసం ఎన్టీఆర్ మొదటిసారి సింగర్ గా మారారు. కీరవాణి సంగీతం అందించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో `ఓలమ్మి తిక్క రేగిందా` అంటూ ఎన్టీఆర్ ప్లే బ్యాక్ సింగర్ గా అదరగొట్టారు. 2008లో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ `కంత్రి` మూవీ చేశాడు. మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. కంత్రి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డప్పటికీ.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాడిన `1 2 3 నేనొక కంత్రి` సాంగ్ మాత్రం సూపర్ ట్రెండ్ అయింది.
2014లో థమన్ సంగీతం అందించిన `రభస` మూవీలో `రాకాసి రాకాసి` అంటూ మరోసారి ఎన్టీఆర్ తన గాత్రంతో మ్యూజిక్ లవర్స్ ను అలరించారు. అలాగే ఎన్టీఆర్ లోని సింగింగ్ టాలెంట్ ను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా బాగా ఉపయోగించుకున్నారు. డీఎస్పీ మ్యూజిక్ అందించిన మూడు చిత్రాల్లో తారక్ సాంగ్స్ పాడాడు. 2010లో అదుర్స్ మూవీలో `చారీ`, 2011లో వచ్చిన ఊసరవెల్లిలో `శ్రీ ఆంజనేయం`, అలాగే 2016 లో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రంలో `ఫాలో ఫాలో` అంటూ తారక్ ఆలపించిన పాటలు మంచి ఆదరణ పొందాయి. ఇక తన క్లోజ్ ఫ్రెండ్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కోసం `చక్రవ్యూహ` చిత్రంలో `గెలేయా గెలీయా` అంటూ కన్నడలోనూ సాంగ్ పాడి మెప్పించాడు తారక్.