మంచు ఫ్యామిలీలో గత కొద్ది నెలలుగా వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అన్న విధంగా అన్నదమ్ములు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు ఫ్యామిలీ మొత్తం ఒక సైడ్ ఉండగా మంచు లక్ష్మి మంచు మనోజ్ మాత్రం ఒక వైపు ఉన్నట్టు కనిపిస్తోంది. అప్పట్లో లోలోపల గొడవలు జరిగినప్పటికీ ప్రస్తుతం వీరు బహిరంగంగానే ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ఇటీవల మంచు మనోజ్ తన సినిమా బైరవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో షాకింగ్ కామెంట్లు చేశారు.

మనోజ్ శివయ్య అంటూ కౌంటర్లు వేయగా అవి మంచు విష్ణు పైనే వేసినట్టు చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై మనోజ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను శివయ్య అన్నానని, కానీ సాధారణంగానే చెప్పానని అన్నారు. నోటితో కాదు మనసుతో పిలవాలని చెప్పానని అన్నారు. ఇందులో మరే అర్థం లేదని స్పష్టం చేశారు. కానీ మనోజ్ మాట్లాడిన తీరు మాత్రం విష్ణుపై కౌంటర్లు వేసినట్టే చాలామందికి అనిపించింది. దీంతో మనోజ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి కారణం మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శివుడి భక్తుడిగా విష్ణు కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలోనే మనోజ్ తన అన్నపై కౌంటర్లు వేసినట్టు పలురు అభిప్రాయపడ్డారు. ఇక గతంలో వీరి పంచాయతీ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. మంచు మనోజ్ జన్వాడ ఫామ్ హౌస్ లో ఉండగా దానిని ఖాళీ చేయాలని మంచు విష్ణు మోహన్ బాబు మనుషులు తనని ఇబ్బంది పెట్టినట్టు మనోజ్ చెప్పారు.

తన ఇంట్లో జనరేటర్ లో విష్ణు చక్కర పోసాడని ఆరోపించాడు. ఇక మోహన్ బాబు కూడా ఓ ఆడియోను విడుదల చేసి మనోజ్  పై సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్ తాగుడుకు బానిస అయ్యాడని ఆరోపించారు. ఇలా వరుస విమర్శలతో మంచు ఫ్యామిలీ వార్తల్లో ఉండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే మనోజ్ ప్రస్తుతం సినిమాల పై ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ నటించిన భైరవ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా మిరాయ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: