సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ల విషయంలో మంచి విజయాలు ఎవరికైతే దక్కుతూ ఉంటాయో వారికి అద్భుతమైన క్రేజీ సినిమాలలో , స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో ఇది రాంగ్ అని కూడా ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే ఓ ముద్దుగుమ్మకు భారీ అపజయం దక్కింది. కానీ ఆ సినిమాలో ఆమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈమెకు ప్రస్తుతం వరుస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

మరి ఇంతకు టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ను అందుకున్న వరుస పెట్టి క్రేజీ అవకాశాలను దక్కించుకుంటున్న ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భాగ్య శ్రీ బోర్స్. ఈమె రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. కానీ ఈ సినిమాలో ఈమె తన అందంతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు వరుస పెట్టి తెలుగు క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

ప్రస్తుతం ఈమె రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే ఈమె చేతిలో మరిన్ని క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. ఈమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధిస్తే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: