ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగిన వాళ్లంతా కెరియర్ లో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు . సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.  తాజాగా అదే లిస్టులోకి వచ్చేస్తున్నాడు  టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వడ్డే నవీన్ . ఇప్పుడంటే ఈ పేరుకి పెద్దగా పాపులారిటీ లేదు. పేరు చెప్తే గుర్తు పట్టడానికి జనాలు చాలా టైం తీసుకుంటారు . కానీ ఒకప్పుడు మాత్రం వడ్డే నవీన్ అంటే కాలేజీకి వెళ్లే అమ్మాయిలు పడి చచ్చిపోయే వాళ్ళు. ఆయన నటించిన సినిమాలోని ఫొటోస్ పేపర్ లో వస్తే కట్ చేసి మరీ బుక్స్ లో పదిలంగా దాచుకునే వాళ్ళు .


వడ్డే నవీన్ ను అంతగా లైక్ చేసేవారు.  మరి ముఖ్యంగా "పెళ్లి" సినిమా ఆయన కెరీయర్ ని మలుపు తిప్పిందని చెప్పాలి . వడ్డే నవీన్ గురించి చాలామందికి తెలిసిందే . 2000 సంవత్సర కాలంలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేశాడు . వడ్డే నవీన్ మరెవరో కాదు తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడే.  1996లో "క్రాంతి" సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నవీన్ ఆ తర్వాత సినిమాలో నటించి ఇండస్ట్రీకి ఎన్నో క్రేజీ హిట్స్ ఇచ్చారు. కాగా 2016 లో వచ్చిన "అటాక్" అనే సినిమాతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు .



ఆ తర్వాత ఎక్కడ ఉన్నాడు ..? ఏం చేస్తున్నాడు..? అనే విషయాలు బయటకు రాలేదు. దాదాపు 9 ఏళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన ఇప్పుడు ఇండస్ట్రీలోకి  రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు . వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వడ్డే నవీన్ ఒక కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో అందరూ కొత్త నటీనటులే నటించబోతున్నారట.  కొత్త డైరెక్టర్.. కొత్త హీరో హీరోయిన్లు.. కొత్తగా విలన్ అవతారం ఎత్తబోతున్న నవీన్ అంతా కొత్త కొత్తగా ఉండబోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే వడ్డే నవీన్ ఈసారి హీరోగా కాకుండా విలన్ గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దీని కోస, ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . చాలామంది వడ్డే నవీన్ తరహా వాళ్ళు విలన్ క్యారెక్టర్ లో నటించి మెప్పిస్తున్నారు. ఇప్పుడు వడ్డే నవీన్ ఎలా మెప్పించబోతున్నాడో అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . కచ్చితంగా నవీన్ కి ఉన్న  టాలెంట్ కి జనాలను బాగానే ఎంటర్టైన్ చేస్తాడు . కానీ సినిమా కొత్త వాళ్లతో తెరకెక్కిస్తున్నారు.. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: